Friday 5 June 2009

కడలి - తీరం వోలె మన రాగా బంధం..
కదిలే కెరటం పోలె నీ స్నేహ భాష్యం...
పోటు వై వచ్చే వేళ కళ్ళ లో నిలిచే నీ రూపం ..
ఆటు వై పోయే వేళ మనసంతా నీ ధ్యానం,,,

వరం
కెరటం కదిలొచ్చే వేళ కడలిలా నేనున్నా ..
హోరు గాలి వీచే వేళ భువనమై చూస్తున్నా..
వర్షించే మేఘానికి వరదనై తోడున్నా ..
నను వీడి పోయే వేళ నీకోసం కన్నీరైనా ...


వరం
కళ్ళలో నిలిచిపోయిన ..
.అర విరిసిన మందారానికి ..ఆరణాల అణుపు చీరె కి ..అర చేతి గోరింతకీ ....ఆర బెట్టిన వెండి వెన్నెలకి ...
వాకిలి ముందు రంగు ముగ్గుకి ..సంధ్య వేళ ఎర్రబడ్డ ఆకాసానికి .. పిల్ల తెమ్మెర పైరు గాలికి .. ఆ గాలికి నటనమాడే వరి కంకుకి ..

కలత నిద్ర కలలే సమాధానమిచ్చే వేళ ...
కను సన్నల కన్నీటి సంద్రమే సమాధానమిచ్చే వేళ ...
కంచికి పోయే కథలే సమాధానమిచ్చే వేళ ..
తామరాకున నీటి బొట్టులా ... అనంతకాసాన అణుదివ్వెలా ...
వరం ,...

Sunday 7 December 2008

నీ అంతరంగాల తలపులే ఆటు పోటు లై న హృదయాంతరాలన్నీ తాకే వేళ!!


నీ మేని సోయగాల వలపులే విరీచికలై నా కను సన్నల కదిలే వేళ !!


నీ శ్వాస నిశ్వాసల ఊయలలే శ్రుతి లయ లై నా మనసును మీటే వేళ !!


నీ కను సైగల సరిగమలే పదనిస లై నా మేనిని చేరే వేళ !!


నా హృదయం ప్రవాహమై నీ హృదయ సాగరం లో కలవాలని...


ఆ సంగమమే సుమధురమై కలకాలం నిలవాలని ....!!!

Saturday 6 December 2008

పడమటి తీరం చేరిన తూరుపు సింధూరం ..

తెల వారు తూరుపు తొలి సంధ్య వేళ ... సోగపోయిన నయనాలతో ముంగారు కురుల జడ కుప్పెల్లతో ..పట్టు పరికిణీల... పరువపు వోణి ల...సరిగమ పదనిస సప్త స్వరాలే ..కాలి అందియలతో..ఇల్లంతా చిలకరించుతూ ..చిరునవ్వు కుసుమాల విరిమాలలే ...విరజల్లూతూ ..విహరించే సీతాకోకచిలుక ...పడమటి తీరాన్ని చేరే ఆ సుదూర పయనమే ..ఈ ..పడమటి తీరం చేరిన తూరుపు సింధూరం ...




మార్పూ అనేది ఎప్పుడు మారదు !!..ఇది నా జీవితం లో ఎప్పుడు నిజం అవుతూనే వచ్చింది ,, ఆ నిజం నా ఉద్యోగం లో కూడా తన ఉనికిని నిజం చేసుకుంది ,, ఆ మార్పే... నా పడమటి తీరానికి ప్రయాణానికి కారణం... ...కళ్యాణం వస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు అని అమ్మ చెప్పేది ,, కానీ కళ్యాణమే కాదు ,,, క్లైంట్ కి దయ కలిగితే ఎంత దూర ప్రయాణమైన ఆగదు ..అని మేనేజర్ చెప్పడం తో .. నా ప్రయాణం ఇలా మొదలయ్యింది ...




నేను మేఘాల మీద విహరించడానికి కావాల్సిన పనులన్నీ ఆగ మేఘాల మీద జరిగిన విధానం చూస్తే రెప్ప వేయడానికి ... శ్వాస తీస్కోడానికి కూడా చాలా టైం పడుతుంది అని నాకు అర్ధమయ్యింది ,,,, ...అలా అన్నీ ...అయ్యేక .. కన్నీళ్ళ బరువుతో వాలిపోయిన రెప్పల్లతో..ఆనందంతో.. ఆశ్చర్యంతో..అపోహలతో నిండిపోయిన మనసుతో,,,కన్నీళ్ళతో వీడ్కోలు చెపుతున్న ...నా వాళ్ళందరిని,,,మళ్లీ ఎప్పుడు చూస్తానా అని ఆలోచనలతో ...ఇంద్రభవనం లా ,, పద్మవ్యూహం లాంటి ,,,ఎయిర్ పోర్ట్ లో అడుగు పెట్టెను ,,, పద్మవ్యూహం అని ఎందుకు అన్నాను అని అనుమానం కదా,,, అంతకు ముందు ఎప్పుడు ఎవరికీ టాటా చెప్పడానికి కూడా అడుగు పెట్టని నాకు ,,అల్లంత దూరాన విమానాన్ని చూసిన నాకు అది ..నాకు పద్మవ్యుహమే కదా...

....***....................................





లోపల అడుగు పెట్టేక అనుకున్నంత పద్మవ్యుహమేమి కాదు ...అని మొదటి అడుగు లోనే అర్ధమయ్యింది ..ఇద్దరు అబ్బాయిలు వచ్చి మేడం ..మీకు ఏమైనా సహాయం కావాలా అని చేతిలో పెట్టెలు తీసుకుంటుంటే ఆహా అనుకున్నా... పర్లేదే,,, ఇక్కడ వీళ్ళు ఇలాంటి సహాయాన్ని పెట్టేరు అని అనుకున్నా... చివర్లో వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు కానీ అర్ధం కాలేదు .. వాళ్ళు చేసింది సహాయం కాదు ,,, కూలి అని ...




కూలి అని తెలిస్తే ..అమ్మో వంద రూపాయలా!!! అని వాళ్లకి ఇచేదాన్ని కాదేమో,,,రూపాయి విలువ తెలిసిన రైతు బిడ్డను కదా,, ఎంతైనా .....ఏమో ఇచ్చేదాన్నేమో మరి ....ఎందుకంటే మరి మా అమ్మ నా ఇల్లు మొత్తం సర్దేసింది కదా ఆ మూడు పెట్టెలలో...





లోపలి రాగానే అబ్బాయిలు వున్నారు కదా వాళ్ళు కౌంటర్ చూపించేరు కౌంటర్ దగ్గర కెళితే పెద్ద లైన్... వామ్మో అనుకున్నాను ఇంతలోనే అక్కడ ఒక ఫ్రాన్స్ అతను కనిపించేడు ..టికెట్ లో విమానం లో రెండు రకాలు ఉంటాయని ఒకటి ఏమో బిజినెస్ క్లాసు రేట్ ఎక్కువ... బాగా డబ్బున్న వాళ్ళకి అది .రెండోది ఎకానమీ కాల్స్ అది నొర్మల్ కాస్ట్ బిజినెస్ క్లాసు వాళ్ళ వేమో ఫస్టు లో వస్తాయి ఎకానమీ వాళ్ళవి ఏమో లాస్ట్ లో వస్తాయి .. అని అప్పుడే తెలిసింది ... అసలే ..అమెరికా మార్కెట్ నష్టాల వల్ల... కష్టాల ఊబిలో కూరుకిపోకుండా ... జాగ్రత్తగ కాపాడుకోస్తున్న కాదు కాదు నెట్టుకొస్తున్న ... భారత దేశ కంపెనీ లలో మాది ఒకటే కదా,,, అందుకే వాళ్ళకు తగ్గట్టుగా ... నాకు ఎకానమీ క్లాసు లోనే టిక్కెట్ ఇచ్చేరు మరి ..... సరే ఆ ఫ్రాన్స్ అతనిదేమో బిజినెస్ క్లాసు.... నేను హెల్ప్ చేస్తాను ద అని చెప్పి నన్ను తీసుకెళ్ళి తనతో టికెట్ క్లియర్ చేయించేడు అప్పుడు టికెట్ తీసుకుని వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇచ్చేరు .. అక్కడే లగేజి వాళ్లే తీసుకున్నారు ..మళ్లీ విమానం మారినప్పుడు మనం తీస్కోవాల్సిన అవసరంలేదు డైరెక్ట్ గ అమెరికా లోనే.....అని తెలిసేసరికి కాస్తంత కుదుట పడింది మనసు... దీన్ని బట్టి అర్ధమయిందా ...అవెంత బరువున్నాయో హుమ్మయ్య లగేజి గొడవ వదిలిపోయింది కదా ఫ్రీ అయ్యెను ..అప్పుడు లోపలికెళ్ళి వాళ్ళ దగ్గర స్లిప్ లో నా అడ్రస్ ఫిల్ చేసాక,, లోపలి కెళితే అక్కడ వాళ్ళు మనం ఫిల్ చేసిన అన్నీ సిస్టమ్ లో నోట్ చేసేక అడిగేడు ....ఎందుకు వెళుతున్నారు అని ..మనం చెప్పాలి అప్పుడు .. " నా కోసమే జనాలు అక్కడ తెగ ఎదురు చూసేస్తున్నారు ..నేను పెద్ద పుడింగిని అని ,,నే వెళ్ళక పోతే అక్కడ మునిగి పోతుంది అని ,,వాళ్ళకి ,,..ఆ అదంతా ఉత్తికే ఎవరికి తెలియదు ?? మనం వెళ్ళేది డబ్బులు సంపాదించడానికి అని .. ఎవరికి తెలియదు ,,, ఆ మాత్రం తెలియదా రా నీకు అనుకుంటూ ..., ఈ ఈ ఈ అని ఓ నవ్వు నవ్వేను ,,, అంతే ఫ్లాట్ పడ్డాడు గురుడు ,,అలాగా..అని తను కూడా నవ్వేసి ,, అల్ ది బెస్ట్ అని చెప్పి స్టాంపు వేసాడు పాస్ పోర్ట్ మీద...హమ్మ .. ఇక్కడికి నా పాస్ పోర్ట్ రెడీ అయిపొయింది స్టాంపు తో సహా.





ఇప్పుడు చిన్న బాగ్ హ్యాండ్ బాగ్ మనతో పాటు విమానం లోపలి పట్టుకేల్లె వాటిని చెక్ చేస్తారు .అంట ..అన్నీ తీసి చూస్తారా ఏంటి ఇప్పుడు అనుకున్నా కానీ ... ఏంలేదు వాళ్ళకి ఇచ్చేయాలి అంతే వాళ్ళు చూసి స్కాన్నేర్ ఉంటది మన బాగ్ లో ఏమున్నాయో వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట అలా స్కాన్ చేసి ట్యాగ్ వేసి ఇచ్చేసారు ..బాగ్ తో పాటు మనం కూడా ఒక రూమ్ లో కెల్లాలి మనల్ని కూడా చేక్క్ చెయ్యాలి కదా,,,:)... హుమ్మయ్య బాగ్ చెక్ అయిపోయింది మనల్ని కూడా చెక్ చేసేసారు కదా,, సో రెడీ అన్నమాట.. ఎదురుగ సిస్టమ్ లో ఫ్లయిట్ నుంబెర్స్ కనిపిస్తాయి అన్నమాట ఆయన అక్కడ వాళ్ళు కూడా చేప్తర్లె ఏ బ్లాక్ లోకి వెళ్ళాలి అని ..ఆ బ్లాక్ లోకి వెళ్లి కూచోవాలి... కూచున్నాక కాసేపయ్యాక పొట్టి పొట్టి ద్రెస్సెస్ తో ఎయిర్ హోఇస్తేస్స్ వస్తారు .. :) తిట్టకే ఊరికే జోక్ చేసెను ...వచ్చి మన బోర్డింగ్ పాస్ చూసి మనల్ని ఒక గొట్టం లని దాంట్లోకి నడవమంటారు ,,, ఆ గొట్టం డైరెక్ట్ గ ఫ్లయిట్ లోకి ఉంటది ,,, బస్సు లో నుంబెర్స్ చూసుకుని కూచున్నటే మనం కూడా ఇక్కడ మన సీట్ నెంబర్ చూసుకుని కూచోవాలి ,,అంతే కాసేపయ్యాక బెల్ట్ పెట్టుకోమంటాడు ,, బ్రహ్మానందం ల ప్యాంటు బెల్ట్ కాదు :) సీట్ బెల్ట్ ఎలా పెట్టుకొవాలో కూడా చూపిస్తాడు జస్ట్ హుక్ చేక్సోవడమే... చేసుకున్నాక కాసేపయ్యాక విమన్మ జుయ్యి మన్తూ స్టార్ట్ అయ్యీ ఊఁ పది నిమిషాల్లో ఎగురుతుంది,,,, స్లో గ స్లో గ పైకి పైకి అలా అలా మేఘాల మీదకి ... కింద నుంచి చూసే మేఘాలు ఫై నుంచి చూస్తాము ,, కసేపయ్యక్క అలా అలా...ఇంకేం కనపడదు ... జస్ట్ ఫ్రీ స్పేస్ అంటే... అలా అలా... కాసేపు టీవీ చోసుకున్తూ ... ముందు సీట్ కి పెట్టి ఉంటది లే చిన్న టీవీ రిమోట్ కూడా ఉంటది లే ...సోది ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి ,, మనకి అనవసరం కదా ,,,మనం హ్యాపీ గ బజ్జుందం.....కాసేపు బజ్జునే సరికి వస్తారు ...స్నాక్స్ లంచ్ అన్తూ ,, అలా అలా తొమ్మిది గంటలు ...మళ్లీ చెప్తారు బెల్ట్ పెట్టుకోండి అని ఊఁ మర్చిపోయేను కదా పైకి ఎగిరేక తీసేయ్యోచు మళ్లీ దిగేటప్పుడు పెట్టుకోవాలి .... సక్సెస్ ఫుల్ గ దిగి పోయెను లండన్ లో ఆమ్స్టర్ దొం లో ...దిగేనా.. దిగేక అక్కడ ఒక ఆఫీసర్ నిలబడి చెక్ చేస్తున్నారు పాస్ పోర్ట్ అది .. ఈ ఈ నేను మళ్లీ నవ్వెను ఊఁ చిన్న స్మైల్ పడ్డాడు గురుడు ఎం చెక్ చెయ్యకుండానే వెళ్ళిపో అన్నాడు :) హ హ హ పిచ్చి మాలోకం .....మర్చిపోయనమ్మా చెప్పడం ..విమానం లో ఎక్కే ముందు ఒక అబ్బాయి హాయ్ చెప్పేడు న ముందు సీట్ లోనే కూచున్నాడు ..మాట్లాడేను కాసేపు న పక్క న ఉన్న అబ్బాయి మాత్రం పుస్తకాల పురుగు .. చదువు కుంతునే ఉన్ననాడు ,, :)సరే విమానం లండన్ లో దిగేసాక ఆ అబ్బాయి అక్కడ వరకే అంట బాయ్ చెప్పేసి వెళ్లిపోయేడు సరే బాయ్ చేపెసేను నేను కూడా,,, దేవుడా ఈ ఎయిర్ పోర్ట్ లో నాలుగు గంటలు ఎలా ర అనుకున్నాను ,, కానీ ఎంత పెద్ద ఎయిర్ పోర్ట్ తెల్సా .. గంట సేపు నడుస్తూనే ఉన్నాను చుట్టూ చోస్తూ ... నేను దిగిన చోటు కి మళ్లీ విమానం ఎక్కే చోటు కి మధ్యలో ... అమ్మ ఇక్క్కడ కొంచమే ఇండియా వాళ్ళు కొంచం లండన్ వాళ్ళు కొంచెం అమెరికా వాళ్ళు .. కలకూరగంప ...హ హ హ ... సరే బాత్ రూమ్ కెళ్ళి మొహం కడుక్కుని వచ్చి కూచున్న అప్పుడు చూసేను కంప్యూటర్ ..అక్కడ వాడు ..నా విమానం వచ్చే ప్లేస్ మార్చెడు అబ్బా :( అనుకుని మళ్లీ అక్కడికి వెళ్ళెను ఈ లోగ రెండు గంటలు గడిచిపోయ్యాయి ... అలా అలా... సరే కూచున్నాను గేలరీ లో ..ఒక ఆంట్ కూచుని వుంది ..మళ్లీ మనం . ఒక నవ్వు బాణం విసిరేము .. అలవాటు గ ..అంతే ఆంట్ పక్క కొచ్చి సెటిల్ అయిపొయింది ..మొదలు . ఎక్కడ నుంచి అమ్మ ..ఎక్కడికి వెళ్తున్నవమ్మ..అది ఇది ..సొల్లు ..సోది.... :)సరే ఊఁ పది నిమిషాల్లో పిలిచేరు మా విమానం ఎక్కేవాళ్ళు రండి అహో అని ... వెళ్లి పోయి లైన్ లో నిలబడ్డాము ..వచ్చింది ఊఁ తెల్ల దొరసాని,,మొదలు పెట్టింది ,,ప్రశ్నలు ఏంటి ఎక్కడికి అవి ఇవి అన్నిటికి ఆన్సర్ చేసేక స్టాంపు వేసింది .. హుమ్మయా రెండో స్టాంపు కూడా పడి పోయింది హ్యాపీ .. సరే ఎక్కి కూచున్న ఫ్లయిట్ లో .. నాన్న గరూ మర్చిపోయేను .. లండన్ లో దిగ గానే వీళ్ళే కదా వేస్ట్ ఫెల్లౌస్ మనల్ని రెండు వందలు ఏళ్ళు రూల్ చేసేరు అనుకున్నాను :)...సరే మళ్లీ ఫ్లయిట్ స్టార్ట్ అయ్యింది జర్నీ లండన్ నుంచి అమెరికా కి .
అమ్మ నాన్నగారు మీ ఇద్దరికీ ఒక జోక్ చెప్పనా... నా టికెట్ లో రెండు న్న ర కి అమెరికా లో దిగుత అని ఉంది ..నేను లండన్ లో ఎక్కేసరికి అమ్మ వన్ అయ్యింది అమ్మ..ఊఁ గంట లో ఎలిపోతను అనుకున్నాను ..ఎక్కేక న పక్కన ఒక అమ్మాయి కూచుని ఉంది ,ఆ అమ్మాయి ని అడిగెను ఎంత సేపు అని ఏదో చెప్తుంది లే ఒక గంట అని తను అప్పుడు తొమ్మిది గంటలు అంది ఆహ నా మొహం చూడాలి ,, చిన్న పిల్ల ..చేతిలో చాకలేట్ లాక్కు పోతే ఎలా పెడతారో అలా అయ్యింది ..మళ్లీ ఇంత సేపు అను కుని సరే పడుకున్నాను .. కాసేపటికి ఒకతను వచ్చి పోలిన మిస్ పోలిన.. అన్నాడు ..వాడు ఏమన్నాడో నాకు అర్ధం కాకా నేను కాదు అన్నాను ..మళ్లీ అడిగేడు అప్పుడు నేనే నేనే అన్నాను ,, వాడొక పిచ్చి నవ్వు నవ్వేడు నేనొక వెర్రి నవ్వు నవ్వెను :).. సరే ఏదో గడ్డి పెట్టేడు ,తినలేక తిన్నాను న పక్కన పిల్ల చాల అమాయకం గ ఉంది అనుకున్నాను వామ్మో న పక్కనే కూచుని వైన్ తాగింది నాకు కళ్ళు తిరిగాయి ,, మళ్లీ పడుకున్ను, వచేసింది అమెరికా..అమ్మ చెప్పలేదు కదా ...ఎదురుగ ఉన్న టీవీ లో మనకి ఎంత దూరం లో ఉన్నాము ఎలా వెళ్తున్నాము కనిపిస్తుంది కూడా అమ్మ.. దాంట్లో చూసి వచేసింది అనుకుని హ్యాపీ గ దిగిపోఎను,... బయటికోచి లగేజి తీసుకుని,కార్ కోసం పార్కింగ్ దగ్గర కేల్లెను.... అక్కడ ఒక తను ఉన్నాడు ,, అతనికి ఒక కాలు మోకాలి దగ్గర నుంచి లేదు ..చెయ్యి మోచేతి దగ్గర నుంచి లేదు .. అతను అక్కడ ఎయిర్ పోర్ట్ లో కార్ ని పిలిపించే జాబ్లో ఉన్నాడు అదే మన ఇండియా లో అయతే ..రోడ్ మీద అడుక్కోవటానికి రెడీ అయి పోతారు కదా అమ్మ .. అదే నాన్న మనకి ఇక్కడికి తేడా అనిపించింది,,సో కార్ వచ్చింది,,నాకేం ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పి వచేయ్ అన్నారు సరే అని కార్ ఎక్కేసి అడ్రస్ ఇచేసేను అతనికి ,, మంచి వాడు ,,ఎక్కడ ఆయన ఆపవ,,కాల్ చెయ్యాలి అని అడిగెను ,,నా ఫోన్ లో చేస్కో డియర్ అన్నాడు ..డియర్ అనడం ఇక్కడ కామన్ అమ్మ భయపడకే :)... అతని ఫోన్ తీస్కోని రూమ్ లో అమ్మాయికి కాల్ చేసెను ,, నేను వెళ్ళేక ఒక అరగంట కి వచ్చింది ,, పాపం అప్పటివరకు ఆ కార్ డ్రైవర్ నాతోనే ఉనండు మీకు తోడు గ ఉంటాను అని ,, మళ్లీ ఊఁ స్మైల్ ఇచెను అతనికి :) ఈ ఈ ఈ ... సరే ఈ అమ్మాయి వచ్చింది ..తను వెళ్లిపోయేడు ..సో హ్యాపీ గ రూమ్ కొచ్చి పడ్డాను అమ్మ...
అమెరికా కి వచ్చేసాను ,,, తూరుపు సింధూరం పడమటి తీరం చేరింది అమ్మ... బాగా అయ్యిందా నా ప్రయాణం...

Thursday 3 July 2008

food for thought?


తప్పేముంది నా కన్నులు వర్షిస్తే !!


అమ్మా .ఆవు . ఇల్లు .ఈగ. వినాల్సిన నోటి వెంట అమ్మా..ధర్మం.. అన్నా ధర్మం వినిపించే ఆ క్షణాన ..

కలం పట్టి భూమి వైపు ఉండే చేయి ,,రూపాయి కోసం తిరగబడి ఆకసాన్ని చూసే..ఆ క్షణాన ..

స్కూలు బస్సు లో వెళ్ళే రోజా లాంటి తోటి పాపను చూస్తూ ..వాడిపోయి మాడిపోయిన పువ్వు లాంటి తనను చూసుకునే ఆ క్షణాన ..

నేనెప్పుడు " అలా " అనుకున్నప్పుడే ఆ చిన్ని కళ్ళల్లో తెప్పెల్లిన ఆ కన్నీటి వరదను చూసిన ఆ క్షణాన ..

చందమామ రావే..జాబిల్లి రావే..అని అమ్మ పాట వినాల్సిన సమయాన చీ పో ..చీ చీ అని విన్న సమయాన,,

వసి వాడిన పసి బాల్యాన్ని చూసిన ఆ క్షణాన ..



తప్పేముంది నా కన్నులు వర్షిస్తే !!

వింతేముంది నా హృదయం ద్రవిస్తే..!!

Wednesday 11 June 2008




పెదవి ఫై పువ్వై విరుస్తావనుకుంటే .....కన్నీటి బిందు వై రాలిపోయ్యేవు ,


సప్తపది తో నడుస్తావనుకుంటే...చిటికెనవేలు చేజార్చిపోయ్యేవు...


మూడు ముళ్ళ బంధమై మురిపిస్తావనుకుంటే ...ముచ్చెమట బిందు వై మాయమయ్యి పోయేవు..


చిన్ని గుండెలో దీపమై వెలుగుతావనుకుంటే ...దివ్వెలా ఆరిపోయ్యేవు ..


జీవితమే చీకటి చేసేవు ,,న్యాయామా .. నీకిది??